కొన్ని పాటలకు ఎన్ని ఏళ్లైనా సరే ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. విన్నా కొద్ది ఇంకా ఇంకా వినాలని అనిపిస్తూనే ఉంటాయి. అలాంటి పాటల్లో 'పల్లె కన్నీరు పెడుతుందో' పాట ఒకటి. కుబుసం సినిమాలోని ఈ పాటను అప్పటి ప్రేక్షకుల నుంచి ఇప్పటి ప్రేక్షకుల వరకు అందరూ కనెక్ట్ అయ్యారు. పల్లె ప్రజల కష్టం ఏంటో ఒక్క పాటలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు.