ఒకప్పుడు సినిమాల్లో నటిగా వెలుగొందాలంటే పెళ్లి, పిల్లలు అనేవి అడ్డంకులుగా భావించేవారు. ఒకసారి పెళ్లయ్యాక నటీమణుల కెరీర్ దాదాపుగా అయిపోయినట్టే అని భావించేవారు. అయితే.. ఈ మధ్య కాలంలో మాత్రం అలా లేదు. పెళ్లై, పిల్లలు పుట్టాక కూడా ఇండస్ట్రీలో స్టార్‌లుగా కొనసాగుతున్నారు.