ప్రస్తుతం మలయాళంలో దూసుకుపోతున్న "ఎల్2 ఎంపురాన్" అనూహ్యంగా రాజకీయ వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి మురళిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, విలన్ పాత్రను హిందువుగా చూపించి ఇతర మత సముదాయాలపై దాడులు చేసేలా అభ్యంతరకరమైన ప్రదర్శన చేశారని కొందరు ఆరోపిస్తున్నారు.