నర్సింగ్ కోర్సులు చదివిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు నైపుణ్యాభివృద్ధి సంస్థ మంచి అవకాశం కల్పిస్తోంది. నర్సింగ్ కోర్సులు చదివిన వారికి జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఆరు నెలల పాటు జర్మనీ భాషను నేర్పించి.. జర్మనీలో ఉద్యోగం కల్పిస్తోంది ఈ విషయాన్ని విశాఖ నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. ఆసక్తికలవారు సంప్రదించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలై.. వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారు సంప్రదించాలని సూచించింది.