ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014లో కాదు.. 2009లోనే జరగాల్సి ఉండేదని చెప్పుకొచ్చారు. చాలా మంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే తెలంగాణ ఏర్పడేది కాదని అనుకుంటారని.. కానీ అసలు జరిగింది ఇదే అంటూ.. ఆనాటి రాజకీయ రహస్యాన్ని కిరణ్ కుమార్ రెడ్డి బయటపెట్టారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తీర్మానం పెట్టినట్టు తెలిపారు.