టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో ఒక పేజీ పద్మనాభం పేరిట ఉంటుంది. అసలు కమెడియన్ పద్మనాభం గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ.. ఒకప్పుడు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన పేరది. ఇప్పుడు మనం బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ, సునీల్, అలీ.. ఇలా వీళ్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ.. అసలు కమెడియన్ అంటే ఒకప్పుడు పద్మనాభమే.