కొన్ని పాటలకు మనం ఇట్టే కనెక్ట్ అయిపోతుంటాం. మరీ ముఖ్యంగా సాడ్ సాంగ్స్‌కు జనాలకు చాలా తొందరగా కనెక్ట్ అయిపోతారు. అలా సాడ్ సాంగ్స్ ప్రస్తావన గుర్తుకు వస్తే ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాట వచ్చి 21 ఏళ్లు అయిపోయింది. అయినా ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ రిపీట్ మోడ్‌లో వింటుంటారు. ఆ పాట మరేదో కాదు 'కన్నుల భాషలు తెలియవులే'. 7/G బృందావన కాలనీ సినిమాలోని ఈ పాటను కార్తిక్ ఆలపించాడు. యువన్ శంకర్ రాజా స్వరపరిచాడు.