శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.