హీరో నిఖిల్ నటిస్తున్న "ది ఇండియన్ హౌస్" సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలో సముద్ర దృశ్యాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో, లొకేషన్ మొత్తం నీటమునిగింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా కొంతమంది చిత్రబృంద సభ్యులు గాయపడ్డారు.