ollywood: ఎవర్‌గ్రీన్ లవర్‌బాయ్ సిద్ధార్థ్, అదితిరావు హైదరీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి అంగరంగ వైభవంంగా జరిగింది.
ఎవర్‌గ్రీన్ లవర్‌బాయ్ సిద్ధార్థ్, అదితిరావు హైదరీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దక్షిణాది సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి అంగరంగ వైభవంంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకులకు ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మాత్రము హాజరయ్యారు.
ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు గతకొంత కాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మహాసముద్రం’ సినిమాలో వీరిద్ధరూ తొలిసారి కలిసి నటించారు.
షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ప్రచారం జరిగింది. కానీ వీళ్ల రిలేషన్‌పై ఈ జంట ఇప్పటివరకు స్పందించింది లేదు. ఎప్పుడు దీని గురించి ప్రశ్నలు ఎదురైనా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఆ మధ్య ఈ జంట పలు పార్టీలకు కలిసి వెళ్ళడంతో వీరిపెళ్లి త్వరలోనే అన్నట్లు ప్రచారం జరిగింది.
అంతేకాదు శర్వానంద్ ఎంగేజ్‌మెంట్, పెళ్లికి కలిసి వెళ్లడం ఈ రూమార్లకు మరింత ఆజ్యం పోసింది. కాగా మొన్నా మధ్య ఈ జంట ఏకంగా ఎంగేజ్‌మెంట్ చేసుకుందన్నట్లు కూడా సోషల్ మీడియాను ఊపేశాయి. ఇటీవలే ఈ బ్యూటీ తన పెళ్లి వార్తలపై స్పందించింది.
తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన వనపర్తి జిల్లాలోని పురాతన దేవాలయంలోనే పెళ్లి కూడా జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా తనకు సిద్దార్థ, హైదరాబాద్‌లోని తన నానమ్మకు చెందిన ఓ స్కూల్ లో ప్రపోజ్ చేశాడని, తన నానమ్మ ఆశీస్సుల కోసమే ఇలా చేసినట్టు చెప్పడం తనకెంతో నచ్చి ఓకే చెప్పానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
ఇక సిద్దార్థకు ఇదివరకు మేఘన అనే అమ్మాయితో పెళ్లయింది. 2003లో ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. మనస్పర్ధలు రావడంతో నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సింగిల్ గానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మధ్యలో పలువురు హీరోయిన్ లతో డేటింగ్ చేస్తున్నట్లు కూడా అప్పట్లో ప్రచారాలు జరిగాయి. ఇందులో ఎంతవరకు నిజం అన్నది ఎవరికీ తెలియదు.
ఇక అధితిరావు హైదరీ సైతం ఇదివరకే ప్రముఖ బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2012లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఈ బ్యూటీ కూడా ఒంటరిగానే జీవిస్తుంది. ఇక రెండేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఒక్కటి కాబోయిందని తెలిసి అందరూ హ్యపీగా ఫీలవుతున్నారు.