బాలకృష్ణ హీరోగా నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ఆదిత్య 369.... 34 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. ఏప్రిల్ 11న ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఆదిత్య 369 మూవీకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.