నా కూతురి న్యూడ్ ఫొటోలు అడిగారుఅక్షయ్ కుమార్ ఎమోషనల్ముంబయి: సామాన్యులతోపాటు సెలబ్రిటీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లలో సైబర్ క్రైమ్ ఒకటి. మాయ మాటలు చెప్పో, ఇంకేదో చేసే బ్యాంకు ఖాతాల్లోని డబ్బు దోచుకోవటమే కాదు మన ఫొటోలను మార్ఫింగ్ చేసి, బ్లాక్‌మెయిల్ చేయడంలాంటివీ ఆన్‌లైన్ కేటుగాళ్లకు పరిపాటిగా మారింది. కొన్ని నెలల క్రితం ఇంట్లో జరిగిన చిన్న ఘటన గురించి చెప్పాలనుకుంటున్నా. నా కూతురు ఆన్‌లైన్‌లో ఓ గేమ్ ఆడుకుంటోంది. ‘నువ్వు ఆడా, మగా?’ అని ఓ అపరిచితుడి నుంచి మెసేజ్ వచ్చింది. నా కూతురు ఫిమేల్ అని రిప్లై ఇచ్చింది. ‘నీ న్యూడ్ ఫొటోలు పంపగలవా?’ అంటూ అతడు మరో మెసేజ్ చేశాడు. వెంటనే మా అమ్మాయి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, జరిగిందంతా వాళ్లమ్మకు చెప్పింది. ఇది కూడా సైబర్‌క్రైమ్‌లో భాగమే. దీనిని కట్టడి చేయడం ఎంతో అవసరం’’ అని పేర్కొన్నారు.