Allu Arjun | పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్

1 year ago 18
‘పుష్ప 2 ది రూల్‌’తో (Pushpa 2) థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు కథానాయకుడు అల్లు అర్జున్‌. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రష్మిక కథానాయిక (Rashmika). ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి కేరళలోని కొచ్చిలో ఈ చిత్ర ప్రచార వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun)మాట్లాడుతూ.. ‘ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. మూడేళ్లుగా దీనితో ప్రయాణం చేస్తున్నా. ఇందులో నాకు.. ఫహాద్‌ ఫాజిల్‌ మధ్య వచ్చే సీన్స్‌ అందర్నీ అలరిస్తాయి. ముఖ్యంగా ఫహాద్‌ నటన మలయాళ ప్రేక్షకులంతా గర్వపడేలా ఉంటుంది. 20ఏళ్లుగా నాపై ప్రేమ కురిపిస్తున్న మలయాళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సినిమాలో ఓ పాట మలయాళ లిరిక్స్‌తో ప్రారంభమయ్యేలా సిద్ధం చేశాం. అది అన్ని భాషల్లోనూ అదే లిరిక్‌తో కొనసాగుతుంది. ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో రష్మిక, నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
Read Entire Article