Andhra Pradesh Municipal Elections Polling Booth And Voter Details: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లు వారి ఓటు ఏ వార్డు, బూత్‌లో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే ఆన్‌లైన్లో ఓటు వివరాలు, పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకునేలా ఎన్నికల సంఘం పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటు, పోలింగ్ బూత్ వివరాలు మత్రమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ పోర్టల్ ద్వారా ఓటర్లు తెలుసుకోవచ్చు.