‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSVPG) సినిమా స్క్రిప్ట్‌ను కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశానని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నిర్వహించిన MSVPG థ్యాంక్యూ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ను 15 రోజుల్లో, సెకండ్ హాఫ్‌ను కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేశానని తెలిపారు.