East West Godavari Districts Teacher Mlc Election Liquor Shops Seized: ఏపీలో మద్యం షాపుల్ని 48 గంటల పాటూ బంద్ కానున్నాయి. ఈ నెల 5న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సమీపంలోని మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలున్న సమీప ప్రాంతాల్లో ఈ నెల 3వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ డ్రై డేగా పాటిస్తారు. తప్పనిసరిగా మద్యం షాపుల్ని మూసివేయనున్నారు.