AP News: రాయితీపై పెట్రోల్, డీజిల్.. వారికి మాత్రమే.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే!

1 week ago 5
Petrol Subsidy To Persons With Disability in AP: రాష్ట్రంలోని దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. దివ్యాంగులకు రాయితీపై పెట్రోల్, డీజిల్ అందించనుంది. ఈ మేరకు అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నెలాఖరు వరకూ గడువు ఉంది. వైకల్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారితో పాటుగా స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగులకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. 50 శాతం రాయితీపై వారికి పెట్రోల్, డీజిల్ అందించనున్నారు. ఈ రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.
Read Entire Article