సత్యదేవ్ హీరోగా నటించిన ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలిని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలతో నిండిన ఈ సర్వైవల్ డ్రామాను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి, చింతకింది శ్రీనివాసరావు రూపొందించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.