ప్రముఖ నటుడు అశిష్ విద్యార్థి సతీమణి రూపాలి బరూవా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన కథనాలు ప్రచారం కావడంతో, వాటికి స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో అశిష్ విద్యార్థి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు.