జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే అవతార్ ఫ్రాంచైజ్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్‌కు తోడు, ఈ కొత్త భాగంపై వస్తున్న స్పందన సినిమాను ఒక సాధారణ రిలీజ్ స్థాయి దాటించి భారీ సినిమాటిక్ ఈవెంట్‌గా మార్చేస్తోంది.