‘బాహుబలి’ (Baahubali) టీమ్ మరోసారి ఈ పేరును ట్రెండ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే బాహుబలి యానిమేటెడ్ మూవీ ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్ 1’ (Baahubali The Eternal War Part 1) టీజర్ విడుదల చేశారు. ''బాహుబలి మరణం ఒక ముగింపు కాదు.. ఓ మహాకార్యానికి ఆరంభం.. తన గమ్యం యుద్ధం'' అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ వైరల్ అవుతోంది. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో దర్శకుడు ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది.