నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన కొత్త సినిమా ‘అఖండ 2’ (Akhanda 2 Thaandavam). ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలోని ‘శివ శివ..’ అంటూ సాగే ఎమోషనల్ ఆడియో సాంగ్ విడుదల చేసి సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పారు మేకర్స్. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా.. కనకవ్వ, శ్రుతి రంజనీ ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.