ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తిరుమల యాత్రకు బయల్దేరారు. ఫిల్మ్‌నగర్‌లోని టీటీడీ దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు తీసుకొని, సంకల్పయాత్రను ప్రారంభించేందుకు శాద్‌నగర్‌లోని స్వగృహానికి బయల్దేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, యాత్ర విజయవంతంగా పూర్తవాలని ప్రార్థించారు.