టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన భక్తిని, నమ్మకాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు కాలినడకన ప్రయాణిస్తూ ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్ర వెనుక ఉన్న కారణం రాజకీయంగానే కాకుండా, భక్తి పరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.