అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో నిఖిల్ కోదాత్య్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ గట్రా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'భగ భగ' అనే సాంగ్ రిలీజైంది. కార్తిక్ స్వరపరిచిన ఈ పాటను నేషనల్ అవార్డు విన్నర్ కాల భైరవ ఆలపించాడు. సాంగ్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.