తెలుగు పాప్ సింగర్ స్మిత నుంచి తాజాగా "భీమవరం బీట్" వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇది ఇప్పుడు చార్ట్ బస్టర్‌గా నిలుస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సాంగ్‌లో స్మిత హై ఎనర్జీతో కనిపించింది. స్మిత, ర్యాపర్ నోయల్ షాన్ కలిసి స్వరపరచి, లిరిక్స్ రాసి, పాడిన ఈ పాటలో.. గ్రూవీ బీట్స్, పండుగ వైబ్స్, క్విర్కీ ఫన్ నిండి ఉన్నాయి. విజయ్ బిన్నీ దర్శకత్వం, గ్రీష్మ ఉమేష్ కొరియోగ్రఫీతో ఈ పాట అద్భుతంగా తెరకెక్కింది. ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (RRR) కేమియోలో కనిపించి, స్మితతో కలిసి నడుస్తూ కనిపించారు. ఆయన ఎంట్రీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతూ వైరల్ చేస్తున్నారు. భీమవరం బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ పాట ఆ ఊరి గొప్పతనాన్ని కూడా హైలైట్ చేస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే మిలియన్ వ్యూస్ దాటేసిన ఈ సాంగ్ సంక్రాంతి సంబరాలకు పర్ఫెక్ట్ బీట్ అందిస్తోంది. స్టైలిష్ కాస్ట్యూమ్స్, టాప్-నాచ్ విజువల్స్‌తో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది.