శ్రీకాంత్ కొడుకు రోషన్ (Roshan) హీరోగా ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన సినిమా ‘ఛాంపియన్’ (Champion). పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. డిసెంబరు 25న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ‘సెలబ్రేషన్ ఆఫ్ ఛాంపియన్’ పేరుతో రిలీజ్ టీజర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా వదిలిన ఈ వీడియోలో రోషన్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.