కోర్ట్ మూవీ టీమ్ ని అభినందించిన మెగాస్టార్ చిరు.. ఎమోషనల్ అయిన శివాజి.. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న బడ్జెట్ తో వచ్చిన "కోర్ట్: స్టేట్ వర్సెస్ నో బడీ" సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెటరన్ హీరో శివాజీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించి అదరగొట్టాడు. రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు యాక్టింగ్ తో అలరించారు. అయితే ఈ సినిమా దాదాపుగా ఇప్పటివరకూ రూ.50 కోట్లు పైగా కలెక్ట్ చేసింది.