మరో 4 రోజుల్లో రిలీజ్ కాబోతున్న మన శంకర వర ప్రసాద్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు జనవరి 12 వస్తుందా అని ఫ్యామిలీ ఆడియెన్స్ తెగ వేయిట్ చేస్తున్నారు. దానికి తోడు ఈ మధ్య సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆహా ఓహో అనే రేంజ్‌లో ఉండటంతో సంక్రాంతి అసలు సిసలైన సినిమా ఇదే అని ఫిక్సయిపోయారు. నిన్న రిలీజైన చిరంజీవి హూక్ సాంగ్ మాత్రం ఓ రేంజ్‌లో జనాలకు ఎక్కేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.