ఈ సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటి 'మన శంకర వరప్రసాద్ గారు'. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ జోష్ లో ఉన్న మేకర్స్.. ఈ సినిమా నుంచి ‘శశిరేఖ’ ఫుల్ వీడియో సాంగ్ వదిలారు. చిరంజీవి, నయనతారలపై షూట్ చేసిన ఈ సాంగ్ వెంటనే వైరల్ అయింది.