మెల్లిమెల్లిగా దేవర సినిమాపై అంచనాలు ఎగబాకుతున్నాయి. రిలీజ్‌కింకా కేవలం 13 రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో.. దేవర టీమ్ ఓ స్పెషల్ ఇంటర్వూ ప్లాన్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాను ఊపేస్తుంది.