రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలామంది ఎన్టీఆర్ (jr NTR) అభిమానులు సుమారు ఆరేళ్లకు పైగా ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ దేవర పార్ట్ 1 (Devara1) సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీంతో జూనియర్ ఫ్యాన్స్ సంబురాలు అంబరాన్నంటాయి. అర్థరాత్రి 1 గంట షోతో రెండు తెలుగు స్టేట్స్‌లో ప్రత్యేక షోలు స్టార్ట్ అవ్వగా 12 గంటల నుంచే అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు.