జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్’ వంటి సూపర్‌హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దేవర. సక్సెస్ కాంబో కావడం, ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అభిమానులు అంతే ఆతురతగా ఎదురుచూశారు. ఆచార్య’ ఫెయిల్యూర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆయన కూడా కాస్త జాగ్రత్తగా హిట్ కొట్టాలనే కసితో పనిచేశారు. అయితే పాటలు అలరించినా ట్రైలర్ మాత్రం అభిమానుల్ని నిరుత్సాహపరచడంతో అంచనాలు కాస్త అటు ఇటు అయ్యాయి. దాంతో విడుదలకు మూడు రోజులు ముందు రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ వదిలారు. అది సినిమాపై అంచనాలు పంచేలా చేసింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది. కొరటాల ఖాతాలో హిట్ పడిందా లేదా అన్నది చూద్దాం.