గతేడాది ఇండియాన్ షేక్ చేసిన సినిమాల్లో 'ధురంధర్' ఒకటి. దాదాపు రూ.1300 కోట్లతో బీభత్సం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ పార్ట్ వచ్చేస్తుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ పార్ట్ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అసలు ఈ సారి రికార్డులు పాతాళానికి పడిపోతాయి అనే రేంజ్‌లో ఉంది ట్రైలర్. రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది.