హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్‌ను మంగళవారం దిల్ రాజు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అనంతరం, దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పుష్ప2’’ మూవీ ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.