డీఎస్సీ 2008 నియామకాలకు సంబంధించి 3 రిట్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎస్‌జీటీ పోస్టుల భర్తీలో బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు వర్తించే నిబంధనలను ప్రభుత్వం మార్చడంపై కొందరు బీఈడీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీవో నంబర్ 28, రూల్ 7కు సంబంధించిన మార్పులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. మొదట ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారమే ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని వారు కోరారు. రాష్ట్ర విభజన తర్వాత నియామకాలకు సంబంధించిన చర్యలు కొనసాగడం, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వడం వంటి అంశాల నేపథ్యంలో హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థనలను తిరస్కరించింది.