దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన 'డ్యూడ్' సినిమా భారీ విజయం సాధించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలోని 'సింగారి' పాట ఫుల్ వీడియోను మూవీ యూనిట్.. బుధవారం రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాసిన ఈ గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో సాయి అభ్యంకర్ పాడారు. కీర్తీశ్వరన్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో మమితా బైజు, శరత్‌కుమార్ కీలక పాత్రలు చేశారు.