ఐఫోన్ మోజు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చింది. ఏలూరుు పట్టణానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు ఐఫోన్ కొనివ్వాలంటూ ఇంట్లో వాళ్లపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావటంతో మరోసారి కొంటామంటూ తల్లిదండ్రులు నచ్చెజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారి మాటలను వినని రామకృష్ణ ఐఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎలుకల మందు తినేశాడు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు బుధవారం సాయంత్రం ప్రాణాలు విడిచాడు. దీంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.