అత్యంత ప్రతిష్టాత్మకమైన 77వ ఎమ్మీ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్లో వైభవంగా జరిగింది. హాలీవుడ్ ప్రముఖులు, టెలివిజన్ దిగ్గజాలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అమెరికన్ టెలివిజన్ రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఇచ్చే ఈ అవార్డులు అత్యంత గౌరవప్రదమైనవి.