విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ గాంధీ టాక్స్. కిషోర్ పి. బెలేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం.. యాక్టర్లు చూపించే హవాభావాలతోనే ట్రైలర్ సాగింది. ఈ మూకీ సినిమాలో ఏ.ఆర్ రెహమాన్ సంగీతమే మాట్లాడబోతుంది. అదితిరావు హైదరీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది.