Half day Schools: ఏపీలో మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు.. విద్యాశాఖ కీలక నిర్ణయం

2 weeks ago 4
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏపీలో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మార్చి 16వ తేదీ నుంచి ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. మరోవైపు పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకూ తరగతులు నిర్వహిస్తారు.
Read Entire Article