క్యూర్ బిల్లు-2026 ప్రకారం హైదరాబాద్‌లో నీటి, సీవరేజీ ఛార్జీలు ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది. దాదాపు 10 లక్షల వినియోగదారులపై ఈ ప్రభావం పడనుండగ.., 20 కిలోలీటర్ల వరకు ఉచిత నీరు పొందే 5 లక్షల మంది మినహాయింపులో ఉంటారు. ఐదేళ్లలో చార్జీలు సుమారు 25 శాతం వరకు పెరగవచ్చు. నగరంలో ప్రస్తుతం రోజుకు 150 ఎంజీడీల నీటి కొరత ఉంది. సీవరేజీ ఛార్జీలను నీటి బిల్లుతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా విధించే ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది.