ప్రతి వంటకంలో రుచి కోసం, కొన్నిసార్లు కంటికి అందంగా కనిపిచటం కోసం కొత్తిమీర, పూదీన, కరివేపాకుతో పాటు జీడిపప్పు లాంటివి వేస్తుంటారు. తింటున్నప్పుడు అవి నోటికి తగులుతూ మరింత రుచిగా ఉంటుందని. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ మధ్య మాత్రం చాలా వంటకాల్లో.. తింటున్నప్పుడు బొద్దింకలు, జెర్రీలు, రకరకాల పురుగులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు చాలా వెలుగు చూడగా.. తాజాగా ఆదివారం (నవంబర్ 03న) మరో రెండు ఘటనలు వెలుగు చూశాయి.