హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ఆరు ఫైవ్-స్టార్, ఒక ఫోర్-స్టార్ హోటల్‌తో పాటు.. ఒక ట్రేడ్ సెంటర్.. నగరం వెలుపల ఒక వెల్‌నెస్ రిసార్ట్ నిర్మించనున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలలో సుమారు రూ. 6 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ నిర్మాణాల ద్వారా పర్యాటక రంగంలో సుమారు 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.