హైదరాబాద్ జవహర్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం దారుణ హత్య కలకలం రేపింది. సాకేత్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెంబడించి వేట కత్తితో దాడి చేసి, రివాల్వర్‌తో కాల్చి చంపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.