హైదరాబాద్ నగరంలో స్ట్రీట్ ఫుడ్, హోటల్ ఫుడ్స్ తిని ఇటీవల కాలంలో చాలా మంది అస్వస్థకు గురయ్యారు. తాజాగా నందినగర్‌లో మోమోస్ తిన్న ఓ మహిళ ప్రాణాలు సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్ అంటేనే జనం బయపడిపోతున్నారు. చాలా వరకు స్ట్రీట్ ఫుడ్స్‌లో పరిశుభ్రత, నాణ్యత పాటించపోవటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ 3 డేంజర్ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.