హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తండ్రి చిన్నప్పుడే చనిపోవటం.. తల్లికి మనస్థిమితం లేకపోవటంతో ఓ యువతి పెళ్లికి అడ్డంకులు ఏర్పడ్డాయి. పెళ్లి తర్వాత కూడా తల్లి తనతోపాటే ఉంటుందని ఆమె కండీషన్ పెట్టడంతో సంబంధాలు చెడిపోయాయి. దీంతో మనస్థాపం చెందిన యువతి హుసేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.