హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుతం ఉన్న మూడు కోచ్‌ల రైళ్ల స్థానంలో ఆరు కోచ్‌ల భారీ రైళ్లను ప్రవేశపెట్టాలని హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (HMRL) నిర్ణయించింది. మొదట 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇది ప్రయాణికుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసి, ప్రయాణాన్ని సుఖవంతం చేస్తుంది.