హైదరాబాద్‌లో మెట్రో, ఎంఎంటీఎస్ వ్యవస్థలకు అనుసంధానంగా పాడ్ కార్లతో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు హెచ్ఎంఆర్ఎల్, ఉమ్టా అధ్యయనం చేస్తున్నాయి. డిపోల కోసం 185 ఎకరాల భూమిని గుర్తించారు. ఐటీ కారిడార్‌తోపాటు సచివాలయం పరిసరాల్లో నెట్‌వర్క్‌లను ప్రతిపాదించారు. 2050 నాటికి రోజుకు 1.14 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. రద్దీ వేళల్లో 20-25 మంది ప్రయాణించే జీఆర్‌టీఎస్ వాహనాలనూ పరిశీలిస్తున్నారు.