Hyderabad Investment Fraud: స్టాక్ మార్కెట్ లాభాల పేరుతో ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా 65 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ నుంచి రూ.98 లక్షలకు పైగా కొల్లగొట్టారు సైబర్ కేటుగాళ్లు. మరోవైపు, గచ్చిబౌలికి చెందిన 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వీడియో కాల్‌తో బెదిరించి రూ.9.8 లక్షలకు పైగా వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదులతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.